నేడు కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు బుధవారం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మ.12.15 గంటలకు ఆయన అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నగర టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమవుతారు. కాగా, న్యూఇయర్ సందర్భంగా తన కోసం బోకేలు, శాలువాలు, కేకులు తీసుకురావొద్దని సీఎం చంద్రబాబు తెలిపారు.