2025 కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించింది. దీంతో తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు జనవరి1న సెలవు ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం జనవరి 1న పబ్లిక్ హాలిడేగా ప్రకటించలేదు. ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చారు. దీంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేయనున్నాయి. ప్రత్యేక హాలిడే ఇవ్వకపోవడంతో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.