తిరుపతిలో మరో దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి
AP: తిరుపతిలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై బాలాజీ అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనను ప్రేమించాలని కొంతకాలంగా బాలిక వెంటపడుతున్నాడని, ఒప్పుకోకవడంతో ఆమెపై దారుణానికి ఒడిగట్టినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు.