అత్యాచారం చేసి.. 14 రోజులు బంధీగా ఉంచి

61చూసినవారు
అత్యాచారం చేసి.. 14 రోజులు బంధీగా ఉంచి
ఓ వివాహితను అత్యాచారం చేసి 14 రోజులు బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లాకు చెందిన వివాహితను వాసుదేవ్‌ కలార్‌ అనే వ్యక్తి శారీరక సంబంధం పెట్టుకోమని నిత్యం వేధించేవాడు. అక్టోబర్ 29న ఆమెను కిడ్నాప్ చేశాడు. మహారాష్ట్రలోని గంగాపూర్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 14 రోజులు ఓ ఇంట్లో బంధించాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె భర్తకు సమాచారం అందించింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో మాతృ ఆశ్రమాన్ని సాయం కోరడంతో వారు వచ్చి కాపాడారు.

సంబంధిత పోస్ట్