కనుమ.. పితృదేవతల పండుగ
కనుమనాడు తమ చుట్టూ ఉన్న జీవుల పట్ల సామరస్యంగా మెలగడం ఒక ఎత్తు అయితే.. తమని విడిచిపోయిన పితృదేవతలని కూడా స్మరించుకోవడం మరో ఎత్తు. ఇందుకోసం తర్పణాలు విడిచే అలవాటు అందరికీ ఉండదు. కాబట్టి అన్నం ముద్దలుగా చేసి ఆరుబయట ఉంచడమో, పితృదేవతలను తల్చుకుంటూ గారెలను వండుకోవడమో చేస్తుంటారు. ఊళ్లో ఎటు చూసినా తనకు సమృద్ధిగా తిండి లభిస్తోంది కాబట్టి కాకి ఇక ఎటూ కదలాల్సిన అవసరం ఉండదు. అందుకే కాబోలు 'కనుమరోజు కాకి కూడా కదలదు' అనే సామెత వచ్చి ఉంటుంది.