Top 10 viral news 🔥
TG: గ్రూప్-2 పరీక్ష రాస్తుండగా పురిటినొప్పులు
నాగర్ కర్నూల్ (D) బల్మూరు (M) బాణాల గ్రామానికి చెందిన రేవతికి.. నాగర్ కర్నూల్ పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రూప్-2 పరీక్ష రాస్తుండగా పురిటినొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన పరీక్ష నిర్వహణ సిబ్బంది.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకు ఆమె అంగీకరించలేదు. అధికారులు జిల్లా కలెక్టర్ సంతోష్ కి చెప్పడంతో పరీక్ష కేంద్రంలో 108 అత్యవసర వాహనం, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచారు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధంగా ఉంచారు.