పులివెందులలో పర్యటించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట
కడప జిల్లా పులివెందులలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదివారం పర్యటించారు. ఆయన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దేవాంగ సంక్షేమ సంఘం శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.