అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దు: అనిత (వీడియో)
AP: నిర్భయ చట్టం ఉన్నా గత వైసీపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని, అసలు ఆ చట్టానికి చట్టబద్ధతే లేదని హోంమంత్రి అనిత మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వ హయాంలో నేరాలు తగ్గాయని చెప్పారు. అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దని అన్నారు. వైసీపీ హయాంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు.