ఏపీలో మహిళా అఘోరీ అరాచకం సృష్టించారు. సోమవారం ఉదయం మంగళగిరిలో కార్ వాష్ చేయిస్తుండగా తన వీడియో తీశాడంటూ ఓ వ్యక్తిపై దాడి చేశారు. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద హల్ చల్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ నేషనల్ హైవేపై బైఠాయించారు. సుమారు కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. దాడికి కూడా పాల్పడ్డారు.