KCR వ్యాఖ్యలపై CM రేవంత్ కౌంటర్ అటాక్
మాజీ సీఎం KCR వ్యాఖ్యలపై సీఎం రేవంత్ కౌంటర్ అటాక్ చేశారు. 10 నెలల్లో తెలంగాణ ఏమీ కోల్పోలేదన్నారు. పది నెలల్లో కోల్పోయిన స్వేచ్ఛను, ఆర్థిక స్వావలంబనను మహిళలు సాదించాలని చెప్పారు. రూపాయి రూపాయి కూడబెడితే మోదీ వచ్చి సిలిండర్ ధర పెంచారని మండిపడ్డారు. బీజేపీ ఈ దేశంలో ఎక్కడైనా రూ.500కు సిలిండర్ ఇస్తుందా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు.