కిమ్ వింత చేష్టలు భరించలేక దక్షిణ కొరియా అధికారులు, ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. గతంలో తన చెత్త బెలూన్లతో పక్క దేశంలో ఇళ్లు, ఎయిర్పోర్టులు, రోడ్లపై రాకపోకలకు అంతరాయం సృష్టించాడు. ఇప్పుడు మరో విచిత్ర ఆలోచనతో దక్షిణ కొరియాను వేధిస్తున్నాడు. దక్షిణ కొరియా సరిహద్దు గ్రామం డాంగ్సన్ లో మెటాలిక్ గ్రైండింగ్ చేస్తూ.. ఆ శబ్దాలను అక్కడి ప్రజలకు లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి మరీ వినిపిస్తూ నరకం చూపిస్తున్నాడు.