‘టైటానిక్’ కెప్తెన్ వాచీకి రూ.16.9కోట్ల రికార్డు ధర
టైటానిక్ ఓడ దుర్ఘటన సమయంలో 700 మందిని కాపాడిన కెప్టెన్ ఆర్థర్ రోస్ట్రన్కు కానుకగా వచ్చిన పాకెట్ గడియారం వేలంలో రికార్డు ధర పలికింది. టైటానిక్ మునిగిపోయే సమయంలో ఆర్థర్ రోస్ట్రన్ లైఫ్ బోట్ల సాయంతో 700 మందిని కాపాడగా అందులో ముగ్గురు కుబేరులుండగా వారు ఈ వాచీని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ గడియారాన్ని ఇప్పుడు వేలం వేయగా ఓ వ్యక్తి సుమారు 20 లక్షల డాలర్ల (రూ.16.9కోట్లు)కు సొంతం చేసుకున్నాడు.