అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని ఒకేసారి 99 మంది ఉద్యోగులను తొలగించారు. ఆ సంస్థలో 111 మంది విధులు నిర్వర్తిస్తుండగా.. ఆ భారీ తొలగింపు చోటుచేసుకుంది. ఈ మేరకు ఓ ఉద్యోగి చేసిన రెడిట్ పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఉన్నదాంట్లో అందరినీ తొలగిస్తే కంపెనీ ఎలా నడుపుతారని కామెంట్లు చేస్తున్నారు.