జి సిగడాం: ఒడిశా టూరిస్ట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
జి సిగడాం మండలం పాలకండ్యం గ్రామ వద్ద సోమవారం సాయంత్రం ఒడిశాకు చెందిన టూరిస్ట్ బస్సు ఓ పశువుల కాపరిని ఢీకొంది. రోడ్డు పక్కన పశువులను మేపుతున్న పాలకండ్యానికి చెందిన పోలరావును టూరిస్ట్ బస్సు ఢీకొంది. సుమారు 30 మీటర్ల దూరంలో పొలరావు పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని 108లో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. సిగడాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.