రణస్థలం: పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
రణస్థలం మండలం పాతర్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు పాఠశాల తరగతి గదుల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనం అందించాలన్నారు.