

చంద్రగిరి: క్యాబ్ డ్రైవర్ల ఆందోళన
ఉబర్ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని, అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు తిరుచానూరు పంచాయితీ చైతన్యపురం వద్ద నిరసనకు దిగారు. అధికారులు వెహికల్ ఆడిటింగ్ చేపట్టాలని, ఉబర్ పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించుకుని పలు వాహనాలు తిరుగుతున్నాయని ఆరోపించారు. గిరిబాబు, ఖాదర్ భాషా, రమేష్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, భానుప్రకాష్, దొరబాబు, మధుసూదన్ పాల్గొన్నారు.