
చంద్రగిరి: శ్రీ కల్యాణ వెంకన్న ఆలయంలో ఉగాది ఆస్థానం
టీటీడీ స్థానిక ఆలయాల్లో ఆదివారం శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.