మద్యం రిటైల్ షాపులపై సీఎం కీలక నిర్ణయం
AP: మద్యం రిటైల్ షాపులపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ విలువను పెంచాలని నిర్ణయించారు. 10.5 శాతం మార్జిన్ వల్ల నష్టపోతున్నామని, మార్జిన్ విలువను పెంచాలని మద్యం షాపుల యజమానులు కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. 14 శాతానికి మార్జిన్ విలువను పెంచాలని నిర్ణయించారు. మరోవైపు రూ.99కి మద్యం అన్ని చోట్లా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.