
నెల్లిమర్ల: ఫీల్డ్ అసిస్టెంట్ ను తాత్కాలికంగా తొలగింపు
నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బి చంద్రకళ ను విధుల నుండి తాత్కాలికంగా తొలగించినట్లు ఎంపీడీవో రామకృష్ణంరాజు శనివారం తెలిపారు. ఇటీవల జరిగిన సోషల్ ఆడిట్లో ఫీల్డ్ అసిస్టెంట్ పై వచ్చిన ఆరోపణలపై డ్వామా పీడీ విచారణ చేపట్టి ఆమెను విధులు నుండి తాత్కాలికంగా తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఆమె పిడి కు 14 రోజుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.