
నెల్లిమర్ల: సొంతగూటికి బయిరెడ్డి దంపతులు
నెల్లిమర్ల నగరపంచాయతీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచి బయిరెడ్డి నాగేశ్వరరావు, లీలావతి సొంతగూటికి చేరారు. నెల్లిమర్ల బయిరెడ్డి సూర్యనారాయణ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామినాయుడు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ మంత్రి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.