Oct 29, 2024, 04:10 IST/
టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబుమోహన్
Oct 29, 2024, 04:10 IST
మాజీ మంత్రి, నటుడు బాబుమోహన్ టీడీపీలో చేరారు. ఆందోల్ నియోజకవర్గంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ఫొటోను పోస్టు చేశారు. కాగా, గతంలో బాబుమోహన్ బీఆర్ఎస్, బీజేపీలో పని చేశారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బాబుమోహన్ పోటీ చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్‌ను ఆశించగా కమలం పార్టీ తిరస్కరించింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు.