Apr 09, 2025, 12:04 IST/అంబర్పేట్
అంబర్పేట్
హైదరాబాద్: భార్య ఆత్మహత్య.. భర్త అనుమానాస్పద మృతి
Apr 09, 2025, 12:04 IST
హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలో భార్య ఆత్మహత్య చేసుకోగా భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ కలహాలతో నగేశ్ భార్య శిరీష మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం నగేశ్ మృతదేహం ఓ షాపింగ్‌మాల్ వద్ద లభ్యం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగేశ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడం కలకలం రేపింది.