Apr 09, 2025, 08:04 IST/
'గావ్ ఛలో.. బస్తీ ఛలో'కి బీజేపీ పిలుపు
Apr 09, 2025, 08:04 IST
TG: BJP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 6వ తేదీ నుంచి 12 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 10, 11, 12 తేదీల్లో గావ్ ఛలో.. బస్తీ ఛలో కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. పార్టీకి సంబంధించి ఐదు కార్యక్రమాలు, గ్రామానికి సంబంధించిన ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు.