సబ్బవరం: 19 మద్యం షాపులకు 327 దరఖాస్తులు
సబ్బవరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో పరవాడ, సబ్బవరం మండలాల్లో 19 మద్యం షాపులకు 327 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సబ్బవరం మండలంలో 8 షాపులకు 226, పరవాడ మండలంలో 11 షాపులకు 101 దరఖాస్తులు వచ్చాయన్నారు. 14వ తేదీ ఉదయం 8 గంటలకు అనకాపల్లిలో జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తామన్నారు.