Mar 17, 2025, 01:03 IST/
అనకాపల్లిలో తప్పిన ప్రమాదం.. నిలిచిన రైళ్ల సేవలు
Mar 17, 2025, 01:03 IST
అనకాపల్లిలో ప్రమాదం తప్పింది. ఓ లారీ, విజయరామరాజు పేట అండర్ బ్రిడ్జి దగ్గర సేఫ్టీ గడ్డర్ను ఢీకొట్టడంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో అనకాపల్లి నుంచి విశాఖవైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ట్రాక్ మరమ్మతులకు చర్యలు చేపట్టారు. ట్రాక్ పునురుద్ధరణకు సమయం పట్టనుండడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.