పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ డిసెంబరులో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. ఒకే రోజు అన్ని పనులు చేస్తామని తమ ప్రభుత్వం చెప్పటం లేదని అన్నారు. నక్కపల్లి, కొప్పర్తి తదితర పారిశ్రామిక జోన్లకు రూ.10వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.