పెళ్లి బారాత్‌లో స్టెప్పులేసిన పీవీ సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం పీవీ సింధు, వెంకట దత్తసాయిల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా అట్టహాసంగా చేసుకున్నారు. ఈ వేడుక తర్వాత బారాత్‌లో ఇంటికి వెళ్లగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. డీజే సాంగ్స్‌కు పీవీ సింధు స్టెప్పులేశారు.