ఏపీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా శానంపూడి గ్రామంలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో ఫ్యాన్‌కు ఉరేసుకుని అమూల్య(20) సూసైడ్ చేసుకుంది. నవంబర్ 17న తగరం గోపికృష్ణతో అమూల్య వివాహం జరిగింది. అత్త ఆదిలక్ష్మి సూటిపోటి మాటలకు మనస్తాపం చెంది అమూల్య ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గోపికృష్ణ, అతని తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అత్త ఆదిలక్ష్మి కోసం గాలిస్తున్నారు.