ఇరగవరం: 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
ఇరగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004- 2005లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు శనివారం కలుసుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా అందుకున్న పిలుపుమేరకు శనివారం స్కూలు ఆవరణలో నిర్వహించిన అపూర్వ సమ్మేళనంలో పాల్గొని గత స్మృతులను పంచుకున్నారు. ఈసందర్భంగా అప్పట్లో చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.