AP: వాట్సప్ గవర్నెస్స్ సేవలు 200కు చేరాయి. జనవరి 30న మంత్రి నారా లోకేశ్ 161 రకాల సేవలతో ‘మన మిత్ర’ను ప్రారంభించారు. 50 రోజుల్లోనే ఈ సేవలను పెంచారు. వివిధ రకాల పౌర సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వం మన మిత్రను ప్రారంభించింది. విద్య, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు, పర్యాటక సమాచారం, ఆలయాల దర్శనాలు, భూరికార్డులు, తదితర సేవలను వాట్సప్‌లో పొందవచ్చు.