Lokal స్పెషల్ స్టోరీస్ - Lokal Special Stories

అక్రమాలకు కేరాఫ్ గా సబ్ రిజిస్టర్ కార్యాలయం

అక్రమాలకు కేరాఫ్ గా సబ్ రిజిస్టర్ కార్యాలయం

సుండుపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అంతులేని అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి పనికి ఒక ధర నిర్ణయించి మరి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుల కంటే అవినీతి సిబ్బందికి చెల్లించాల్సింది రెండింతలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. చెయ్యి తడపందే కనీసం కార్యాలయం లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యవర్తులు సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు గా చలామణి అవుతున్నారని విమర్శలు సుండుపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ప్రత్యేక కథనం రిజిస్ట్రేషన్ ల కోసం కార్యాలయానికి వస్తున్న ప్రజలు మధ్యవర్తుల ద్వారా లక్ష రూపాయలు మామూలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. స్వయంగా అధికారులే దళారులను నియమించుకొని వారి ద్వారా పార్టీల వద్దనుండి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఉదయం విధి నిర్వహణకు వచ్చిందే మొదలు సాయంత్రానికి లక్షల రూపాయలు వసూలు చేసుకుని వెళ్తున్నారు. అసలు మధ్యవర్తులు లేనిదే రిజిస్ట్రేషన్లు జరగవు అని రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లిన వారు చెబుతున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని పట్టించుకునే నాదులే కరువయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరిట ఇదే కార్యాలయంలో అవినీతికి పాల్పడ్డ కండి అంటూ వాల్ పోస్టర్లు అంటించారు. కానీ దానిని పాటించే ఒక ఉద్యోగి కూడా అక్కడ కనిపించడం లేదు. కనీసం ఆక్కడ పని చేస్తున్న వారిపై నిఘా కూడా ఉండదు. కార్యాలయానికి వచ్చిన ప్రజలను అక్కడి అధికారులు సిబ్బంది దోచుకున్నవారికి దోచుకున్నంత మహాదేవ అన్న విధంగా పీల్చి పిప్పి చేస్తున్నారు. మధ్యవర్తుల నుండి దసరా లేఖలు సిబ్బంది వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు ఆదిలోనే వసూలు చేస్తున్నారు. అనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. మధ్యవర్తులు ప్లాట్ల బిజినెస్ లో లక్షల రూపాయలు రేట్లు పెంచి అమ్ముకుంటున్న సరిపోలేదు అనే విధంగా రిజిస్ట్రేషన్ దగ్గర కూడా కక్కుర్తి పడుతున్నారు. అనేది స్పష్టంగా తెలుస్తోంది. మండల కేంద్రంలో ఇంటి స్థలాలకు గిరాకి ఉండడంతో దాని అదునుగా భావించిన చాలామంది మధ్యవర్తులు (బ్రోకర్లు) ప్రజలను మోసం చేసి లక్షలు దండుకుంటున్నారు. ఇంటి స్థలాలు కొనేందుకు సామాన్య ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రేట్లు లేకపోయినా ఉన్నట్టుగా సృష్టించి ప్రజలను మభ్యపెడుతున్నారు. కొంతమందికి దళారి పని తప్ప మరో పని లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు.

ad