ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసాయం?
Jul 01, 2024, 06:07 IST/

కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసాయం?

Jul 01, 2024, 06:07 IST
పంటల ఉత్పత్తుల ధరలను ప్రభుత్వాలు కాకుండా పెద్ద కంపెనీలు నిర్ణయిస్తాయి. దేశ ప్రజల అవసరాల కోసం పంటల సాగు కాకుండా, ఈ కంపెనీలకు ఏది లాభమో దానినే ఉత్పత్తి చేయించగలరు. ఇప్పటి వరకు పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న కొద్దిపాటి ఆహారధాన్యాలు కూడా దూరమవుతాయి. ప్రభుత్వాలు ఎరువులు, విత్తనాల మీద ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా తొలగిస్తాయి. వ్యవసాయ రంగంలో నూతన పరిశోధనల నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. బ్యాంకుల నుండి రైతులకు రుణాలు అందవు. పంటల పెట్టుబడికి, రైతు కుటుంబ అవసరాలకు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తుంది.