రెరాకు 56 మంది ఉద్యోగులు మంజూరు
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ ఆథారిటీ (టీజీ రెరా)కు 56 మంది ఉద్యోగులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమర్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో 39 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 17 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మంజూరు చేశారు.