ఎంతో కోల్పోయా: జానీ మాస్టర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ వీడియోను షేర్ చేసుకున్నారు. 'నేను 37 రోజుల్లో ఎంతో కోల్పోయాను. నా కుటుంబం, శ్రేయోభిలాషుల ప్రార్థనలు నన్ను ఈరోజు ఇక్కడకు చేర్చాయి. సత్యం ఎప్పడూ ఓడిపోదు. నా కుటుంబం మొత్తం గడిపిన ఈ జీవిత దశ, ఎప్పటికీ నా హృదయాన్ని గుచ్చుతుంది' అని పేర్కొన్నారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా ఉన్న మాస్టర్ బెయిల్‌పై శుక్రవారం విడుదలయిన విషయం తెలిసిందే.