ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర ప్రమాదం జరిగింది. గాలిలో ఉండగానే రెండు తేలికపాటి విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విమానాలు కూలిన వెంటనే మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. సిడ్నీ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.