ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఒక వస్తువును మార్కెట్లో లాంచ్ చేయాలంటే.. ముందుగా దాని ప్రోటోటైప్ విడుదల చేస్తుంది. కొన్నేళ్ల తరువాత ఇలాంటి వాటిని సంస్థలు వేలంలో విక్రయిస్తాయి. 1983 నుంచి మనుగడలో ఉన్న అలాంటి ఒక యాపిల్ ప్రోటోటైప్ ‘మాకింతోష్ #ఎమ్001’ వేలానికి వచ్చింది. ఇది సుమారు 120000 డాలర్లకు(రూ.1 కోటి కంటే ఎక్కువ) అమ్ముడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.