అజ్ఞాతంలోకి పేర్ని నాని కుటుంబం!
AP: సొంత గోదాములో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సతీమణి జయసుధ శుక్రవారం మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు గోదాములో రేషన్ బియ్యం మాయమవడంపై కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని కుటుంబంతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజ కనిపించడం లేదు. అరెస్ట్ తప్పదన్న భయంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నారు.