ఆ సమయంలో నా గుండె బద్దలైంది : నటుడు శివకార్తికేయన్
తన 17వ ఏటనే తన తండ్రి మరణించారని కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. ఆయన చనిపోయాక ఎన్నో కష్టాలు అనుభవించినట్లు చెప్పారు. 'మా నాన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన డ్యూటీకి వెళ్లేటప్పుడు షూ పాలిష్ చేసి, బ్యాడ్జీ అందించేవాడిని. అలా ఓ సారి రెండు రోజుల్లో వస్తానని చెప్పిన ఆయన ఐస్బక్స్లో తిరిగి వచ్చారు. అంత్యక్రియలు ముగిశాక ఎముకలే మిగిలాయి. అవి చూసి నా గుండె బద్దలైంది' అంటూ పేర్కొన్నారు.