వేపనూనెని హెయిర్ కేర్ రొటీన్‌లో యాడ్ చేసి మసాజ్ చేస్తే హెల్దీ సెల్స్, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఈ నూనెతో జట్టు పల్చబడదు, ఊడిపోదు, పొల్యూషన్, స్ట్రెస్ వల్ల జుట్టు రాలే సమస్యలుంటే తగ్గిపోతాయి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్ గుణాలు బట్టతలని తగ్గిస్తాయి. రెగ్యులర్‌గా వేపనూనె రాస్తే జుట్టు తెల్లబడడం కంట్రోల్ అవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది.