యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పగటి పూట టీవీ ప్రసారాల్లో జంక్ ఫుడ్ ప్రకటనలు నిలిపివేయాలని గురువారం యూకే ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ నిబంధనలు వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఇటీవలే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 16 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ వాడకాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే.