క్యాన్సర్ ఔషధాల లభ్యత ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిలో లేదని తాజా విశ్లేషణలో తేలింది. ప్రధానంగా కొత్త రకం క్యాన్సర్ మందులు ధనిక దేశాల్లో వేగంగా అందుబాటులోకి వస్తుండగా.. అల్పాదాయ దేశాలు మాత్రం అంత త్వరగా వాటికి నోచుకోవడం లేదని నిర్ధారణ అయ్యింది. 1990 నుంచి 2022 వరకు 111 దేశాల్లో క్యాన్సర్ ఔషధాల లభ్యతను అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం విశ్లేషించింది.