వారితో మాకు సంబంధం లేదు: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్
ఎవరైనా అల్లు అర్జున్ అభిమానులని చెప్పుకుని ఇతర హీరోల మీద, రాజకీయ నాయకుల మీద కామెంట్స్ చేసే వారితో మాకు ఎటువంటి సంబంధం లేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఫ్యాన్స్ అని టీవీ, యూట్యూబ్ ఛానెల్స్‌లో ఇంటర్వ్యులు ఇస్తే అది వారి వ్యక్తిగతం.. అంతేగాని వారి భావజాలానికి ఎటువంటి అధికారిక మద్దతు ఉండదు. అల్లుఅర్జున్ ఫాన్స్ అని చెప్పి ఇతర హీరోలపై కామెంట్స్ చేస్తే సపోర్ట్ చేయం, వారిని దూరంగా ఉంచటం జరుగుతుంది అని ప్రకటించింది.