AP: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులపై తిరుపతిలో కేసు నమోదైంది. సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల సందర్భంగా తిరుపతిలో బాలయ్య అభిమానులు ఓ సినిమా థియేటర్ వద్ద పొట్టేలును బలిచ్చారు. సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియోను పోలీసులు చూశారు. పొట్టేలు నరికిన ఐదుగురిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.