కర్ణాటకలో దేశ చిత్రపటంపై దుమారం.. స్పందించిన కాంగ్రెస్

62చూసినవారు
కర్ణాటకలో దేశ చిత్రపటంపై దుమారం.. స్పందించిన కాంగ్రెస్
కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్‌ నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో హస్తం పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్‌ల‌పై దుమారం చెలరేగింది. బ్యానర్‌లోని భారత చిత్రపటంలో జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు లేకుండా భారత్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్.. ఆ బ్యానర్లను తమ పార్టీ అధికారికంగా పెట్టింది కాదని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్