కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. అర్బన్ నక్సలిజాన్ని 2026 కల్లా అంతమొందిస్తానని అమిత్ షా చెప్పారని, కానీ ముందు బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ, గిరిజనులను ఊచకోత కోస్తున్నారని ఆరోపించారు. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించకపోగా.. కార్పొరేట్ అధిపతులను పెంచి పోషిస్తున్నారని అన్నారు.