బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా థియేటర్లలో విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. పైరసీ సైట్లలో హెచ్‌డీ ప్రింట్ రావడంతో అభిమానులు షాకవుతున్నారు. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కూడా ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఆ ప్రింట్‌ను ఓ ప్రైవేట్ బస్సులో ప్రదర్శించిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.