సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 6,432 బస్సులను నడపాలని నిర్ణయించిన టీజీఎస్‌ఆర్టీసీ ఇప్పటివరకు 5 వేలకు పైగా బస్సులు నడిపింది. మరో కొన్ని గంటలపాటు రద్దీ కొనసాగే అవకాశముంది.