పాప్‌కార్న్ ఇలా చేసి తిన్నారో..
పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆహార పదార్థాల్లో పాప్‌కార్న్ ఒకటి. ఇందులో ఉండే పాలిఫినోలిక్, మెగ్నీషియం ఆరోగ్యానికి ఉపకరించేవేనట. దీనిలోని పీచు పదార్థాలు రక్తనాళాలు, ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తాయి. పాప్‌కార్న్‌ను మైక్రోవేవ్ బ్యాగ్‌లో వేసి తయారు చేయడం వల్ల అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మార్కెట్‌లో కొనుగోలు చేసే పాప్‌కార్న్ పిల్లలకు తినిపించకూడదు.