వడదెబ్బ లక్షణాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారీ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. వడదెబ్బకు గురైన వారి శరీరం వేడిగా ఉండి చెమట పట్టదు. చర్మం వేడిగా, పొడిగా మారి ఎర్రబడుతుంది. విపరీతమైన తలనొప్పి, తల తిరుగుడు, కండ్లు తిరిగి పడిపోవడం లాంటి సమస్యలు బాదిస్తాయి. శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. అలసట, నిసత్తువ నెలకొంటుంది.