కన్నప్ప సినిమా నుంచి 'కాలాముఖ' పాత్ర పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్స్‌గా రూపొందుతున్న 'కన్నప్ప' మూవీ నుంచి ప్రతి సోమవారం ఒక అప్డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సోమవారం రాజుగా 'కాలాముఖ' పాత్రకు సంబంధించి అర్పిత్ గంకా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పలువురి పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా డిసెంబర్లో విడుదల కానుంది.